

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యల పైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ మేము టూత్ బ్రష్ గాళ్లమై తే మీరు బూటు పాలిష్ గాళ్లా అని కామెంట్ చేశారు. స్మార్ట్ సిటీ నిధు ల్లో అవినీతి జరగలేదని తెలిజేశారు.
విషయం మీద చేర్చించేందుకు భద్రకాళీ దేవాలయం ఎందుకు ప్రెస్‌క్లబ్‌కు రావాలంటూ బండి సంజయ్ కు కడియం శ్రీహరి సవాల్ చేసారు. భద్రకాళీ, భాగ్యలక్షీ ఆలయా ల్లో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించసాగారు. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిజేశారు. బీజేపీ నాయకుల మాటల ను ప్రజలు నమ్మరు అని తెలిజేశారు. కాషాయ నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిజేశారు . తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు.