మళ్లీ సత్యమేవ జయతే అంటున్న జాన్‌ అబ్రహమ్‌

31
Satyameva Jayate 2

సత్యమేవ జయతే 2 షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. జాన్‌ అబ్రహమ్‌, దివ్య కోశ్లా కుమార్‌ కలిసి చేస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మంగళవారం నాడు లక్నోలో ప్రారంభమయ్యింది. ఈ సినిమా నిర్మాణం పూర్తవ్వడానికి వచ్చే ఏడాది జనవరి వరకు పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం లక్నోలో మొదలయిన ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాదిలో ముంబాయి పరిసరాల్లో జరుపనుంది. ఈ సినిమాకి మిలప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాలను ప్రముఖ సినీ విమర్శకులు అయిన తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. అవినీతిని నిర్ములించే బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా మొదటి భాగం రిలీజ్‌ అయ్యి మంచి సక్సెస్‌ ను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here