అమెరికా అధ్యక్ష ఎన్నికల లో ఊపందుకుంటున్న బిడెన్ …

16
joe bidan

డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  విరాళాలు బాగా వస్తున్నాయి . సెప్టెంబర్‌లో 383 మిలియన్ డాలర్ల విరాళం చేకూరింది . బుధవారం  ఆయన బ్యాంకు ఖాతాలో 432మిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలియజేశాయి. డెమోక్రాటిక్ నేషనల్ కమిటీలు,మరోవైపు సెప్టెంబర్ నెల డొనాల్డ్ ట్రంప్ విరాళాలను ఆ పార్టీ తెలియజేయనే లేదు .

విరాళాల విషయంలో ట్రంప్‌ కంటే చాలా వెనుకబడ్డ బైడెన్ ఇప్పుడు పెరిగిపోడం గమనార్హం . అగస్టులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 365మిలియన్ డాలర్ల విరాళాలు చేకూరాయి, అప్పుడు బైడెన్ కు 154మిలియన్ డాలర్లు మాత్రమే సహకారం లభించింది.సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్ లో బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చాయి. దాదాపు 203మిలియన్ డాలర్ల పైన  విరాళాలు ఆన్‌లైన్ లో చేకూరాయి. కమల హ్యారిస్‌ను డెమోక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించాకే బైడెన్‌కు విరాళాలు పెరిగాయి.

మొదటి అధ్యక్ష డిబేట్ కారణం గా  బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చాయి.  ఒక్క గంటలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే మొదటిసారి .   బైడెన్‌ వద్ద చేతి నిండా విరాళాలు  ఉండటం వల్లా పొలిటికల్ క్యాంపెయిన్స్‌,ప్రకటనలకు ఇంకా ఖర్చు చేసే అవకాశం ఉంది.

అధ్యక్ష ఎన్నికల ఖర్చు దాదాపు 11 మిలియన్ డాలర్లు చేరుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. 2008 అధ్యక్ష ఎన్నికల మీద ఇది రెట్టింపు ఖర్చు. 2016 అధ్యక్ష ఎన్నికల కన్నా 50శాతం అధికం.  భారీ ఖర్చు తో ఎన్నికల కోసం ఖర్చు చేయడం పట్ల  విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.   1974లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం. కానీ ఆ తర్వాత  సంపన్నులు,బడా కంపెనీలు ఇచ్చే విరాళాలే ఎక్కువైపోయాయి. ఇలా ఎన్నికలను ప్రైవేట్ సంస్థలు భారీ విరాళాలతో ప్రభావం చేయడం ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here