

శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులను సీఎం జగన్ చేతులతో సత్కారించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి ఆలయం, దాసాంజనేయస్వామి ఆలయాలను సందర్శించారు.
రాజశ్యామల యాగంలో కూడా పాల్గొన్నారు. అ తర్వాత విశాఖ శారదాపీఠం వెబ్ సైట్ను జగన్ ఆవిష్కరించారు. విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విమానంలో బయల్దేరి 11.30 గంటలకు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా శారదా పీఠానికి వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం పీఠం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.