జగన్ ఇచ్చిన షాక్ లో అంగన్ వాడీ కార్యకర్తలు…!

50
AP Govt

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుని సిఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముందుకు వెళ్ళడం విశేషం. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో కొన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊహించని షాక్ తగిలింది. అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాం అని అనంతపురం జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు.

అంగన్వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ అమలు కాని కారణంగా రద్దు చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ లను నిర్ణయించి, రెండు, మూడు రోజుల్లో తదుపరి నోటిఫికేషన్ జారీ చేస్తాం అని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ పోస్టుల నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ పోస్టుల నియామకానికి సంబంధించి, అంగన్వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉండగా, ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా రిజర్వేషను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధుల నుండి కూడా ఈ అంశంలో విజ్ఞప్తులు వచ్చాయని ఆయన మీడియాకు తెలిపారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని, ఇంతకు ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మీడియాకు వివరించారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అమలు జరిగేలా అంగన్వాడీ పోస్టుల నియామకాన్ని చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే అంగన్వాడీ ఉద్యోగాల విషయంలో ఏపీ సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here