జూన్ 25 నుండి జబర్దస్త్ … అదరకొట్టే డబల్ కామెడీ తో …!

0
65

లాక్ డౌన్ తర్వాత బుల్లితెరపై వినోదాన్ని పంచడానికి జబర్దస్త్ కామెడీ షో రెడీ అయింది. తాజాగా జరిపిన షూటింగ్ కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఎప్పటిలానే యాంకర్ అనసూయ ప్రోమోతోనే హల్ చల్ మొదలుపెట్టారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రోమోలో ఇంట్రస్టింగ్ విషయాలు ఏంటంటే … అనసూయ తన జబర్దస్త్ గురించి మరోసారి పరిచయం చేస్తూ ఆరు టీమ్స్, ఐదుగురు కంటెస్టెంట్స్ సపోర్ట్, నలుగురిని నవ్వించే పంచులు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రూట్ మారే ప్రస్తకిలేదు అంటూ ఇద్దరు జడ్జీలు, ఒకే ఒక యాంకర్ అంటూ వన్ ఓన్లీ కామెడీ షో జబర్దస్త్ .. ఖతర్నాక్ కామెడీ షో అంటూ ప్రోమోను అదరగొట్టింది. హైపర్ అది టీమ్ కామెడీ ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పడానికి శాంపిల్ గా చిన్న ఝలక్ ఇచ్చింది. అలాగే అభి, రాకెట్ రాఘవ అదరగొట్టేలా స్కిట్స్ ప్లాన్ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రతీ స్కిట్‌లోను మాటలు తూటాల్లా పేలే విధంగా షోను డిజైన్ చేసుకొన్నట్టు కనిపిస్తున్నది. గ్యాప్ తర్వాత వస్తున్న క్రమంలో మంచి ఎనర్జీ కూడా కనిపించింది. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్ళిపోయినా తర్వాత అయన స్థానంలో గాయకుడు మనో ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే రోజా హోస్ట్ గా కంటిన్యూ అవుతుంది. ఇలా కొంత రొటీన్ గా కనిపించినప్పటికీ అసలు షో చుస్తే సరికొత్తగా ఏముంటుంది అనే విషయం స్పష్టమవుతుంది. జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇస్తూ .. ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం .. ఒక పొలిటిషియ్‌కు సీఎం కుర్చీ ఎక్కితే గర్వం .. ఒక కమెడియన్ కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం అంటూ పంచ్ పేల్చాడు. ఇంకా తన స్కిట్‌లో తాగుబోతు రమేష్ అదరగొట్టే పంచులతో ఆకట్టుకొన్నారు. ఇక ఇప్పటివరకు బుల్లితెరపై జబర్దస్త్ దే ఆధిపత్యం. కానీ నాగబాబు వెళ్లి అదిరింది షో స్టార్ట్ చేసిన తర్వాత ఈ షో కాస్త పోటీ కనిపిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో జబర్దస్త్ ను పోటీ తగినట్టుగా ఎలా మార్చారో చుడాలిసిందే. ఇక షో జూన్ 25 వ తేదీన ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here