లుడోతో టైం పాస్ చేస్తున్నా…!

0
146
Smriti Mandhana

కరోనా వైరస్ కారణంగా పూర్తిగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు, క్రికెటర్లు, నటీనటులు. దీని కారణంగా ఇంటికే పరిమితమైన తన సహచరులతో టచ్ లోనే ఉంటున్నానంటూ భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మేము ప్రాక్టీసును పక్కనబెట్టి ఆన్ లైన్ గేమ్స్ తో గడుపుతున్నామని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. జట్టు సభ్యులమంతా ఇప్పుడు ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడుతున్నామంటూ, మేమంతా సన్నిహితంగా ఒక్కచోటే ఉన్న భావన కలుగుతుంది ఈ గేమ్ వల్ల అని అంటుంది.

అలాగే ఫిట్ గా ఉండడం కూడా ముఖ్యమే కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని వర్కవుట్ కూడా ట్రైనర్ సహాయంతో చేస్తున్నాను అని ఆమె చెప్పారు. అంతేకాక కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతో వారికి సహాయంగా ఉంటున్నాను. నా సోదరుడిని ఏడిపించడం నాకు ఇష్టమైన టైం పాస్ అని మంథాన తెలిపింది. ఇక సినిమాలకు నేను విరాభిమానినే అంటూ వారంలో రెండు, మూడు కంటే ఎక్కువ చూడడం లేదని, ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతున్నానని ఆమె పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here