మరిన్ని దేశాలు భారత్ వెంటే.. అవసరమైతే పూర్తి మద్దతు ఇస్తామంటూ ముందుకు..

39
israel-and-france-are-full-supports-to-the-india

భారత్ చైనా సరిహద్దుల్లో వివాదం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో విస్తరణవాద ధోరణితో వ్యవహరించిన చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. ఈ క్రమంలోనే నిషేధిత ప్రాంతం లోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకోవడంతో భారత్-చైనా మధ్య వివాదం మొదలయింది అన్న విషయం తెలిసిందే. ఇక సరిహద్దుల్లో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి అటు భారత్ ఎన్నోసార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ఎప్పుడూ సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఉంది అదే సమయంలో భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకుంది చైనా.

కానీ సరిహద్దులో చైనా ఆటలు సాగలేదు అన్న విషయం తెలిసిందే. భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి చైనా కు సంబంధించిన భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చైనా కు ఎక్కడికక్కడ చెక్ పెట్టింది. ఈక్రమంలోనే జో బిడెన్ వచ్చిన తర్వాత చైనా భారత్ పై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం అని ప్రకటన చేసిన నేపథ్యంలో భారత సరిహద్దుల్లో అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సైనికులను మోహరించడం తో పాటు యుద్ధ విమానాలను కూడా మోహరించింది.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు ప్రపంచ దేశాలు కూడా భారత్ వెన్నంటే నడిచి సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఆర్మీ కి కావాల్సిన అత్యవసరాలను అందించేందుకు ఇజ్రాయిల్ ముందుకు రాగా.. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ కూడా సిద్ధమయ్యింది. మిలిటరీ హెలికాప్టర్ల కు సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీని భారత్కు అందించడానికి సిద్ధమైంది ఫ్రాన్స్. అత్యవసరమైతే తమ దేశంలో వాడే యుద్ధ హెలికాప్టర్లను కూడా ఇస్తాము అంటూ ఇజ్రాయిల్ ఫ్రాన్స్ దేశాలు భారత్ కి హామీ ఇస్తున్నాయి. దీంతో భారత్ మరింత బలపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here