రికార్డు ప‌రంగా అత‌డే టాప్ లెవ‌ల్లో ఉన్నాడు..

23
IPL Auction 2021 Live Updates

ఐపీఎల్‌ 2021 మినీ వేలం కొద్దిసేపట్లో మొదలుకానుంది. ఈ వేలం ప్ర‌క్రియ‌లో మొత్తం 125 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నా… అంద‌రి క‌ళ్లు మాత్రం ఇంగ్లండ్ క్రికెట‌ర్ డేవిడ్ మ‌లాన్ మీదే ఉన్నాయి. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ 20 క్రికెట్లో మ‌లాన్ ప‌రుగులు వ‌ర‌ద పారిస్తుండ‌డంతో పాటు అత‌డే రికార్డు ప‌రంగా టాప్ లెవ‌ల్లో ఉన్నాడు. 2017లో అంత‌ర్జాతీయ 20-20 మ్యాచ్‌ల‌లోకి వ‌చ్చిన మ‌లాన్ 19 మ్యాచ్‌ల‌కే 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా త‌న జోరు కంటిన్యూ చేశాడు. ఐపీఎల్లో ప‌లు ఫ్రాంచైజీలు అత‌డిని సొంతం చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాయి. మలాన్‌తో పాటు ఆసీస్‌ ఆల్‌రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నా.. అత‌డు ఐపీఎల్లో సరిగా ఆడ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌డంతో అత‌డిని భారీ రేట్ల‌కు కొనుగోలు చేస్తాయా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్‌ను 10.75 కోట్లకు కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్ ద‌క్కించుకోగా దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here