IPL వాయిదా వేయడంతో అభిమానులలో నిరుత్సాహం…!

0
190
IPL 2020 re-scheduled

IPL అంటే మజా క్రికెట్ అభిమానులకు పండగ. మరి ఆ పండగని ఎప్పుడెప్పుడు జరుపుకుందామా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటే వాళ్ళ ఆశలమీద నీళ్లు చల్లినట్లైంది. కారణం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్ అండ్ ఓన్లీ రీసన్…కరోనా వైరస్. ఆఖరికి దీని ఎఫెక్ట్ క్రికెట్ ని కూడా తాకింది. ఇప్పటికే దీని ప్రభావం అనేక రంగాల మీద పడగా, కొత్తగా దీని ధాటికి క్రికెట్ కూడా గురిఅవ్వాల్సి వచ్చింది. ఇప్పటికే కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుండి అనేక లేఖలు రావడం కోర్టులో పిటిషన్లు దాఖలు అవడం వలన బీసీసీఐ (BCCI) ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.

ఈ షెడ్యూల్స్ ఇంకా విడుదల చేయలేదు గనుక, కొన్ని రోజులు ఓపికపట్టి పరిస్థితులు అనుకూలిస్తే వెంటనేనే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా స్వదేశం మరియు విదేశాల అభిమానులు క్రికెట్ గ్రౌండ్ కి వస్తారు గనుక స్టేడియం లో అయితే త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. అందువలన దీనిని కొన్ని రోజులు వాయిదావేయటమే మంచిదని భావించి నిర్ణయం తీసుకున్నారట. కేంద్రం కూడా టోర్నీని కొన్ని రోజులు ఆపడమే మంచిదని తెలిపి, ప్రజల ఆరోగ్యమే ముందని భావించి చెప్పడంతో నిర్వహణాధికారులు మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా క్రికెట్ అభిమానులకు మాత్రం నిరుత్సహపరిచే వార్తే అని చెప్పుకోవాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here