IPL ఫీవర్ మొదలైందోచ్..!

343
IPL 2020

IPL టి20… 2020 కి సిద్దమవుతుంది. ఐపీల్ ఫ్రాంచైజ్ లు మంచి ఊపు మీద ఉన్నారు. ఈ వేలంతో క్రికెట్ అభిమానుల్లో ఐపీల్ ఫీవర్ ఇప్పటినుండే మొదలవుతుంది. ప్రస్తుతం క్రీడాకారుల వేలం జరుగుతుండగా అన్ని జట్లు దాదాపు ప్లేయర్స్ ని కొనుక్కుని తమ టీమ్స్ ని రెడీ చేసుకుంటున్నాయి. ఈ సారి వేలం లో తక్కువ వయసున్న క్రికెటర్స్ కూడా కోటీశ్వరులయ్యారు. అండర్-19 ప్రపంచ కప్ లో ఆడుతున్న 17 ఏళ్ళ జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 2.4 కోట్లకు కొనుక్కుంది. రాజస్థాన్ కు చెందిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 2 కోట్లకు కొనుక్కుంది. మరియు ఫామ్ లో ఉన్న కే ఎల్ రాహుల్ ని కెప్టెన్ గా నియమించుకుంది.

అండర్-19 జట్టు కెప్టెన్ ప్రియం గార్గ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 1.90 కోట్లకు సొంతం చేసుకుంది. అంతేగాక కొంత మంది కొత్త ఆటగాళ్లని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఫ్యాట్ కమ్మిన్స్ ను అత్యధికంగా 15 కోట్లకి పైగా కొలకత్తానైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. అతనిని అంత ఖరీదు చేసి కొనటానికి కారణం.. అతడు ఇటు బాల్ తోనేగాక, బ్యాట్ తోనూ రాణించగలడు. అదీగాక కమ్మిన్స్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు.

కొలకత్తానైట్ రైడర్స్ కెప్టెన్ గా దినేష్ కార్తీక్ నే ఉంచింది. వెస్ట్ ఇండీస్ యంగ్ హిట్టర్ హిట్మేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా.. మిచెల్ మార్ష్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. క్రిస్ మోరిస్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, నాథన్ కౌల్టర్ నీల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ పోటీపడగా చివరికి ముంబై 8 కోట్లకి దక్కించుకుంది.

క్రింద మనం మరిన్ని వివరాల్ని గమనించవచ్చు. ఈ సంవత్సరం కొనుగోలు చేసిన మరియు చేయని ప్లేయర్స్ లిస్టులు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here