

వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. 7వ తేదీన కేంద్రం రైతు సంఘాలతో నిర్వహించిన 8వ విడత చర్చలు ఆగిపోయాయి. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఉద్యమం విరమిస్తామని, లేకపోతే ఎంతకాలమైన పోరాటం చేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 15న మళ్లీ చర్చలు జరగనున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుల నిరసనలపై క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి కనిపించడంలేదని న్యాయస్థానం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.