

వెస్టిండీస్ తో జరిగిన మూడు టీ 20 ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడవ మ్యాచ్ లో భారత్ ముందు బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 240 పరుగులతో భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వెస్టిండీస్ మొదటిలోనే రెండు వికెట్లు కోల్పోయి భారత్ గెలుపు ఖాయమే అన్నట్టు కన్పించింది. కానీ కిరన్ పోలార్డ్ మరియు హెర్ట్మేయర్ భీకర బ్యాటింగ్ తో కాసేపు మళ్ళీ దడ పుట్టించారు..! భారత్ మళ్ళీ ఓటమి చవిచూడాల్సి వస్తుందేమో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఈ లోపు ఈ ఇద్దరి వికెట్స్ ను భారత బౌలర్లు తీయనే తీశారు. ఇక వాంఖడే స్టేడియం లో ఉన్న ప్రత్యక్ష అభిమానులతో పాటు మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాచ్ లో భారత బౌలర్లు షమీ, భూవీ, కుల్దీప్ , చాహర్ తలొక రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, రన్ మెషిన్ కింగ్ కోహ్లీ.. పరుగుల వరద పారించారు. మొత్తానికి రెండవ మ్యాచ్ లోపాలని సరిచేసుకుని సిరీస్ కైవసం చేసుకుని టీమ్ సంబరాల్లో మునిగింది. ఈ ఫామ్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ ఇండియన్ క్రికెట్ టీంకి కంగ్రాట్స్ అండ్ అల్ ది బెస్ట్ చెప్తూ మీ మిర్చి పటాకా.