

చాప కింద నీరులా పెరిగిపోతున్న మధుమేహం!, అదేనండి.. మన దేశంలో సుమారు 7.7 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారని IDF (International Diabetes Federation) తెలిపింది. ప్రపంచంలో ప్రతి 6 గురు డయాబెటిక్ పేషెంట్స్ లో ఒకరు భారతీయులే..! ఈ జాబితాలో చైనా మొదటి ప్లేస్ లో, భారత్ రెండో ప్లేస్ లో మరియు అమెరికా మూడో ప్లేస్ లో ఉన్నాయి.
భారత్ లో ప్రతి సంవత్సరం 10లక్షల మంది మధుమేహం మరియు వాటి అనుబంధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 46.3 కోట్ల మధుమేహ రోగులున్నారు. వీరంతా 20 నుండి 79సంవత్సరాలలోపు వయస్సు వాళ్ళే..! మరి భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మధుమేహ నియంత్రణ అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలి. అంతే కాకుండా ప్రజలు కూడా మధుమేహం గురించి అవగాహన పెంచుకుని, మధుమేహ కారక ఆహార పదార్దాలను తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీ mirchipataka.