కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం..!

0
163
WHO director michael j ryan sensational comments

మహమ్మారి కరోనా తో వణికి పోతున్న భారతీయ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంతృప్తినిచ్చే విషయం చెప్పింది. భారత్ కరోనాను విజయవంతంగా తరిమికొట్టగలదని, దాన్ని విజయవంతంగా నిర్ములించగలదని ధైర్యం చెప్పింది. ఇంతకు ముందు కూడా స్మాల్-పాక్స్, పోలియోలాంటి మహమ్మారులను అంతం చేసిన అనుభవం భారత్ కు ఉందని అలానే కరోనాని కూడా భారత్ అంతం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ మంగళవారం చెప్పారు.

జనాభా ఎక్కువగా ఉన్న భారత దేశం లో కరోనా ఎక్కువ రోజులు ఉండే అవకాశమే ఉందని కానీ రెండు కష్టమైనా మహామారులను నిర్ములించడం లో సఫలమైన భారత్ కరోనాను కూడా నిర్ములించగలదని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి గురించి నిర్వహించే రోజువారీ విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. అయితే దీనిని నిర్ములించడానికి ఎక్కువ ల్యాబులు అవసరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 3,30,000 కేసులు నమోదవ్వగా మరణాల సంఖ్య 14 వేలు దాటింది. కాగా కరోనా విషయం లో ప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు ప్రజలు తప్పకుండా పాటించాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ ను ప్రజలు విధిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here