ఇండియా – చైనా మధ్య చర్చలు..! చర్చలో పాల్గొన్న మేజర్‌‌ జనరల్‌ స్థాయి అధికారులు.!

0
93

ఇండియా – చైనా మధ్య గురువారం మరోసారి చర్చలు జరిగాయి. గాల్వాన్‌ ఘటనపై మేజర్‌‌ జనరల్‌ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. ఇదే అంశంపై బుధవారం భేటీ అయిన అధికారులు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చైనా సరిహద్దుల్లో జవాన్లు అమరులైన ప్రదేశంలోనే మరోసారి గురువారం చర్చలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చలు జరగడం ఇది ఏడోసారి. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేదు. దీంతో ఈ రోజు కూడా దానిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గల్వాన్‌ లోయలో రెండు దేశాల ఆర్మీ మధ్య జరిగిన పోరులో మన దేశానికి చెందిన 20 మంది అమరులయ్యారు. చైనాకు చెందిన 40 మందికి పైగా సైనికులు మృతిచెందినట్లు అనుమానిస్తున్నప్పటికీ మరణాల సంఖ్యపై చైనా గవర్నమెంట్‌ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు సరిహద్దు సమస్యలు ఎందుకు వచ్చాయి అన్న విషయాలపై చర్చ జరగనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here