మరికొన్ని గంటల్లో కళ్లుచెదిరే సిక్సులకు రెడీ అవ్వండి…!

0
46
Get ready for IPL-13

ఎడారి హీట్స్ లో అరేబియా నైట్స్ లో ఇసుక తిన్నెల మధ్య పచ్చగా పరచుకున్న మూడు స్టేడియాలు దుబాయ్ లో IPL కు సిద్ధమయ్యాయి. అలుపులేకుండా బాడినోడికి అందినన్ని పరుగుల దాహాన్ని తీర్చేందుకు సిద్ధమయ్యాయి. బ్యాట్ కు బాల్ కు బేలన్స్ ఉండేలా రూపొందించిన ఈ పిచ్ లో హీరో ఎవరో జీరో ఎవరో తేలాలంటే మరికొద్దిరోజుల్లో మొదలవ్వబోయే ఈ ఆటపై కన్నేయాల్సిందే..

IPL -13 కు సర్వం సిద్ధం అయింది. 8 టీములు.. 53 రోజులు.. 60 మ్యాచులు.. 10 డబల్ హేడెడ్ మ్యాచులు.. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగనున్నాయి. మాములుగా icc వన్డే వరల్డ్ కప్ చూడాలంటే నాలుగేళ్ళు ఆగాలి. అదే T20 అయితే రెండేళ్లు ఆగాలి. కానీ అంతకు మించిన ఉత్సాహం కేవలం పది నెలలు ఆగితే చాలు మనకి ప్రతి సంవత్సరం IPL రూపంలో దొరుకుతుంది. కానీ ప్రతి ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే IPL ఈసారి కరోనా కారణంగా అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధం నుండి మళ్ళీ సెప్టెంబర్ లో మొదలు కాబోతుంది అని తెలియగానే అభిమానుల్లో ఉత్సాహం అమాంతం పెరిగిపోయింది.

ఇప్పటికే కరోనాతో రోజూ వార్తల్లో కేసులు..మాస్కులు..మరణాలు..బాధితులు..సోషల్ డిస్టెన్స్ .. వంటి పదాలతో లైఫ్ బోరింగ్ గా మారిపోయింది. మరి ఇలాంటి టైం లో అసలుసిసలు మజా అందించడానికి IPL సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో కళ్ళు చెదిరే సిక్సర్లు.. ఫోరులు.. మెరుపు బ్యాటింగ్..అద్భుతమైన బాలింగ్…వంటి పదాలతో చెవులకు ఆహ్లాదాన్ని ఇవ్వబోతుంది IPL . కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది. ప్రతి ఏడాదిలా ప్రేక్షల కోలాహలం లేకుండా కేవలం మైదానంలో ఆటగాళ్ళే ఉంటారు. పోనీ వికెట్ పడినపుడు ఆటగాళ్లు కవుగిలించుకోవడం, బంతి వేసేటప్పుడు ఉమ్మితో స్విమ్ చేయడం లాంటివి నిషేదించారు. కఠినమైన రూల్స్ తో ఆడబోతున్నారు ఆటగాళ్ళు. ఏదిఏమైనా ప్రేక్షకుడికి కావాల్సింది ఆట.. ఇంకేం గెట్ రెడీ ఫర్ న్యూ IPL .. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి మీ మిర్చి పటాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here