పెళ్లి చేసుకుంటే… రూ. 4 లక్షలు

27
If you get married Rs. 4 lakhs

భారత దేశంలోనే కాకుండా ఇంకా చాలా దేశాల్లో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడంలేదు. ఇక అబ్బాయిలు దీనితో ముదురు బ్రహ్మచారులుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు జపాన్ లొ పెద్ద సమస్య అయ్యి కూర్చుంది.పెళ్ళిళ్లు జరగకపోతుండడంతో జననాల రేటు గణనీయంగా తగ్గుతూవస్తోంది. ఈ పరిస్థితివలన ప్రభత్వం తీవ్ర ఆందోళనలో పడింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఓ కొత్త ఆఫర్‌ తీసుకువచ్చింది. పెళ్లి చేసుకునేలా యువతను ఎంకరేజ్ చేయడం  ద్వారా పడిపోతున్న జననాల రేటును ఎలాగైనా గాడిన పెట్టాలని ఆలోచించింది. ఇందులో భాగంగా. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి పెళ్లి చేసుకునే జోడికి ఆరు లక్షల యెన్‌లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 4 లక్షలకు పైగా)ప్రోత్సాహక బహుమతి పేరున అందించనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ సొమ్ముఆ జంటకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగాదీనికి  కొన్ని నియమాలు కూడా పెట్టింది.యువతీయువకులు మొదటిగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.వారి వార్షికాదాయం 5.4 లక్షల యెన్ ల కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే వారు ఈ పథకానికి అర్హులని తెలిపింది. కాగా, జపాన్‌లో గతేడాది నమోదైన జననాల రేటు 8.65 లక్షలు మాత్రమే. మరి ఈ పథకం ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

stay tuned for more updates at mirchipataka

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here