

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హవా కు కొదువలేదు. అందుకే బాలీవుడ్‌ను నెపోటిజానికి మారుపేరుగా చెబుతుంటారు. తల్లిదండ్రుల సపోర్టుతో సినిమాల్లోకి వచ్చి స్టార్స్‌గా రాణించిన అలియా భట్, రణ్‌బిర్ కపూర్, జాన్వి కపూర్, వరుణ్ దావన్, అర్జున్ కపూర్. వీరందరిని బాలీవుడ్ నెపో-కిడ్స్ గా పిలుస్తుంటారు. అయితే వీరిలో ప్రముఖ సినీయర్ హీరో గొవిందా గారాల పట్టి, హీరోయిన్ టీనా అహుజా పేరు మాత్రం అసలు వినిపించదు. దీనిపై ఆమెను ఓ ఇంటర్య్వూలో అడగగా ఇలా సమాధానమిచ్చారు. తాను ఎప్పుడూ నెపో-కిడ్ని కాదని అన్నారు ఆమె. ఎందుకంటే తాను ఎప్పుడు తన సినిమాలను ప్రమోట్ చేయమని తన తండ్రిని అడగలేదని. అలాగే ఆమె తండ్రి(గొవిందా) కూడా ఎప్పుడూ ఏ నిర్మాతను కూడా తన కూతురు సినిమా ప్రమోట్ చేయమని కోరలేదని వెల్లడించారు. మీ తండ్రి(గొవిందా) ఎప్పుడైన మీకు సినిమాల్లో సాయం చేశారా? అని ప్రశ్నించగా ఆమె ‘ఎప్పుడు లేదు. ఒకవేళ ఆయన అలా చేసుంటే ఇప్పటికి నేను 30 నుంచి 40 సినిమాల వరకు చేసేదాన్ని. కానీ ఆయన నాకు ఎప్పుడు సాయం చేయలేదు. నేను కూడా ఆయన నుంచి సాయం ఆశించలేదు అని అన్నారు. నేను అడిగేతే సహాయం చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారు. కానీ నెపో-కిడ్‌గా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు.