

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దేశం మొత్తం మీద వెయ్యి కోట్లకు పైగా విరాళాల సేకరణ జరిగినట్టు సమాచారం.ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో అయోధ్య రామాలయం నిర్మాణానికి రూ.640 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో అయోధ్య రామాలయానికి, అయోధ్య ధామానికి చేరుకునేందుకు రూ.300 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లు వేస్తున్నారు.
అయోధ్య నగర అభివృద్ధికి రూ.140 కోట్లు, అయోధ్య ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయించారు. అయోధ్యలో అభివృద్ధి చేయబోతున్న ఎయిర్ పోర్ట్ కు మర్యాద పురుషోత్తమ శ్రీరామగా నామకరణం చేయబోతున్నారు.