తుమ్ములు చిటికెలో మాయం అవ్వాలంటే…

101
how-to-stop-sneezing-in-short-time

కొంతమందిలో తుమ్ములు వాతావరణంలో మార్పుల కారణంగా వస్తుంటాయి. శీతాకాలంలో ఎక్కువగా జలుబు చేసి తుమ్ములకు గురవుతుంటారు. మరికొంతమందిలో దుమ్ము, ధూళి కణాలు ముక్కులోకి చేరినప్పుడు, ఫలితంగా తుమ్ములు వస్తుంటాయి. మీకు తెలియని ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే?ఒకసారి తుమ్మినప్పుడు మన గుండె ఒక సెకండ్ పాటు ఆగి,తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

అధిక తమ్ములు కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ తుమ్ములను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని పద్ధతులు పాటించి తగ్గించుకోవచ్చట. అయితే ఆ పద్ధతులు ఏమిటో? వాటిని ఎలా వాడాలో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సాధారణంగా తుమ్ములు వస్తున్నప్పుడు ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకోవడం, ఏదో ఒక గుడ్డ పెట్టుకోవడం చేస్తుంటాము. కానీ కొంతమంది ఏది అడ్డు లేకుండా తుమ్మేస్తుంటారు. దీని కారణంగా తుమ్మినప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడే హానికరమైన వైరస్ మరొక వ్యక్తికి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదొక మార్గం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.గత సంవత్సరం నుండి ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కూడా ఇదొక మార్గమని ఆరోగ్య నిపుణులతో పాటు డబ్ల్యూ హెచ్ ఓ సంస్థ వారు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలతో పాటు తుమ్ములు రాకుండా కూడా నివారించుకోవాలి.

అయితే తుమ్ములు రాకుండా ఏం చేయాలంటే ముందుగా ఇందుకోసం మెంతులు, వాము, మిరియాలు అన్నీ విడివిడిగా వేయించాలి. ఇవన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఒక మిశ్రమంగా తయారుచేయాలి. రోజు ఉదయాన్నే ఒక తమలపాకు తీసుకొని, అందుకు ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక్క గ్రామ్ ఈ చూర్ణం కలిపి బాగా చుట్టి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల అలర్జీల కారణంగా వచ్చే తుమ్మలను అరికట్టవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here