సన్ షైన్ విటమిన్ ని సేఫ్ గా పొందేదెలా

74
Sunlight

విటమిన్ డి అనేది యూనిక్ విటమిన్. దీన్ని సూర్యుడి నుంచి గ్రహించడమనేది మంచి ఆప్షన్. స్కిన్ లోని కొలెస్ట్రాల్ ఎప్పుడైతే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు డి విటమిన్ తయారవుతుంది. తగినంత విటమిన్ డి లెవెల్స్ ను శరీరంలో మెయింటెయిన్ చేయడానికి సన్ లైట్ అనేది శరీరానికి అందాలి.

విటమిన్ డి ఇంపార్టెన్స్:

విటమిన్ డిని సన్ షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఇది శరీరంలోని ముఖ్యమైన విధులకు సపోర్ట్ చేస్తుంది. స్కిన్ సెల్స్ లో ఉండే కొలెస్ట్రాల్ పై సన్ లైట్ పడినప్పుడు విటమిన్ డి తయారవుతుంది.

విటమిన్ డి అనేది గట్ లోని సెల్స్ కు కేల్షియం అలాగే ఫాస్ఫరస్ ను గ్రహించేందుకు హెల్ప్ చేస్తుంది. ఎముకలను స్ట్రాంగ్ గా అలాగే హెల్తీగా ఉంచేందుకు ఇవి అత్యంత ముఖ్యమైనవి. విటమిన్ డి లెవెల్స్ శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్, డిప్రెషన్ అలాగే మజిల్ వీక్నెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ డి లభ్యమయ్యే బెస్ట్ సమయం ఎప్పుడు?

అనేక స్టడీస్ ప్రకారం విటమిన్ డి లెవెల్స్ మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఉంటాయని తేలింది. ఈ సమయంలో యూవీబీ రేస్ తీవ్రత ఎక్కువ. అంటే, విటమిన్ డిని చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా పొందవచ్చు. కనీసం పదినిమిషాల నుంచి ముప్పై నిమిషాలపాటు ఎండలో ఉండగలిగితే రోజంతటికీ అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది.

ఎటువంటి దుస్తులు ధరించాలి?

షార్ట్ స్లీవ్స్ లేదా స్లీవ్ లెస్ టాప్స్ తో పాటు షార్ట్స్ ను ధరిస్తే శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. అలాగే, మరీ ఎక్కువసేపు కఠినమైన ఎండలో ఉండకూడదు. అలా ఉంటే ట్యాన్ తో పాటు సన్ బర్న్ సమస్యలు ఇబ్బందిపెడతాయి. టోపీ లేదా సన్ గ్లాసెస్ ను పెట్టుకుంటే ముఖంపై డైరెక్ట్ గా ఎండ పడదు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఈ ప్రాసెస్ పాటిస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here