మే 3 నుంచి భారత్ లో హాంకాంగ్ మోడల్ అమలు ?

0
122
HongKong Following India

దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ ముగియడానికి ఇంకా కొద్దీ రోజులే ఉంది. గడువు దగ్గర పడేకొద్దీ ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాదానాలు ఆరా తీస్తున్నారు లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? పొడగిస్తారా ? వంటివి. మరో వైపు ప్రజలు ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ రెండు ముఖ్యమే అంటున్న ప్రభుత్వాలు లాక్ డౌన్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇలాంటి పరిస్థులలో లాక్ డౌన్ అమలు చేయని ‘ హాంకాంగ్ మోడల్ ‘ ను భారత్ అనుకరిస్తుందా ? చైనా నుంచి కరోనా సోకినా దేశాల్లో హాంకాంగ్ ఒకటి. జనవరి లో తొలి కేసు నమోదు అయింది march లో కేసుల సంఖ్య 100 కి చేరింది. ఇప్పటివరకు 1000 కేసులు నమోదు అయ్యాయి, నలుగురు చనిపోయారు. 75 లక్షల జనాభా కలిగిన హాంకాంగ్ లాక్ డౌన్ అమలు చేయకుండానే వైరస్ పై విజయం సాధించింది.

వైరస్ కట్టడి చేసేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. కరోనా బాధితులను వెతికి పట్టుకుంది. ఎక్కువ మంది గుమిగుడితే కఠిన చర్యలు తీసుకుంది. భారీ మొత్తంలో జరినామా విధించింది. బయట దేశాల నుంచి ఎవరు వచ్చిన 14 రోజుల క్వారంటైన్ అమలు చేసింది. 2003 లో సార్స్ ని ఎదురుకున్న అనుభవంతో సామజిక దూరాన్ని జీవితంలో భాగస్వామ్యం చేసుకుంది. ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించారు. ఈ విధానాలే హాంకాంగ్ ను సాధారణ పరిస్థితులలో నిలబెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here