“HIT” మూవీ రివ్యూ : మంచి త్రిల్లింగ్ హిట్ ..! | “HIT” Movie Review

0
247
HIT Movie Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
మిర్చి పటాకా రేటింగ్ : 3/5
నటీనటులు : విశ్వక్ సేన్, రుహని శర్మ, మురళి శర్మ, బ్రహ్మాజీ, తదితరులు…
దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను
నిర్మాత‌లు : ప్రశాంతి.టి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : ఎస్ మణి కందన్
ఎడిటర్ : గ్యారీ బి హెచ్

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన త్రిల్లర్ మూవీ ‘హిట్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కథలోకి వెళ్తే… సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసే విశ్వక్ కి తన లవర్ రుహాని శర్మ మిస్సింగ్ కేసుతో లింక్ ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అప్పాయింట్ అవుతాడు. ఇన్వేస్టిగేషన్ మొదలుపెట్టిన విశ్వక్ అసలు తన లవర్ మరియు ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యారు? వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రైమ్ వెనుక ఉన్న నిందితులను విక్రమ్ పట్టుకున్నాడా? అనేది మాత్రం వెండి తెరపైన ఛడాల్సిందే..!

సినిమా ప్రేక్షకులకి నచ్చుతుందనే చెప్పుకోవాలి. విశ్వక్ నటన అదుర్స్ మాములుగా హీరో విశ్వక్ రఫ్ గా ఉండటం అతని నటన కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అయితే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు. భావోద్వేగాలను బాగా పండించాడు. హీరో విశ్వక్ తోపాటు బ్రహ్మాజీ ,నటుడు చైతన్య మరియు కానిస్టేబుల్ పాత్ర చేసిన మురళి శర్మ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు. హీరోయిన్ రుహాని శర్మ కూడా చాలా బాగా నటించింది.

నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ప్రతి సన్నివేశం రిచ్ గా ఉన్నాయి. సినిమా మొత్తం మీద బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా అసలు కారకులు తెలియకుండా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం విసిగిస్తాయి. చిత్ర నిడివి ప్రధానమైన మైనస్. అంతేగాకుండా క్లైమాక్స్ లో సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చి సినిమాకు సరైన విలన్ ని లేకుండా చేశారు అని ఫీల్ అవుతారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది.

అయితే మొత్తం మీద సినిమా విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకుంటుంది. అంతేగాక సీనం మధ్యలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అందరినీ అలరిస్తాయి. త్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడేవారికి సినిమా ట్రీట్ ఇస్తుంది. పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకునేవారికి ఈ సినిమా నచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here