థైషోతో దుమారం రేపుతున్న కుమారి…

0
56
hebba patel

కుమారి హెబ్బా పటేల్ గురించి తెలియని వారు ఉండరు.. ఈ భామ కెరీర్ ఆరంభం ముచ్చటగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది …కానీ ఇటీవల కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కోవలసివచ్చింది..`అలా ఎలా` చిత్రంతో తెలుగులో పరిచయమైనా ఈ ముంబై హాట్ బాంబ్ తొలి సినిమాతో యువతను తనవైపుకు తిప్పుకుంది .`కుమారి 21ఎఫ్`తో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది .. ఆ తర్వాత సినిమాలు ఆగలేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా ఆమెకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. ఇక లిప్ లాక్ లకు ఎక్స్ పోజింగుకి హెబ్బా ఏమాత్రం అడ్డు చెప్పదు. కానీ పరాజయాలే ఆమెను ఇబ్బంది పెట్టాయి. ఇటీవల దాదాపు రెండేళ్ల పాటు సినిమాలు లేవు.. `భీష్మ`లో గెస్ట్ రోల్ లోమెరిసింది ఈ ముంబయి భామ.

ప్రస్తుతం రాజ్ తరుణ్ తో కలిసి మరోసారి `ఒరేయ్ బుజ్జిగా`లో ముఖ్యపాత్రలో చేస్తుంది.. దీంతోపాటు రామ్ హీరోగా తెరకెక్కుతున్న `రెడ్`లో ఐటెమ్ సాంగ్ లో తన గ్లామర్ తో మరింత కిక్కెంచేందుకు రెడీగా ఉంది. హీరోయిన్ గా అయితే ఇప్పుడు హెబ్బాకి ఆఫర్లు తక్కువనే చెప్పుకోవాలి. మరోవైపు తాజాగా ఫోటో షూట్ కి హెబ్బా కుర్రకారుకి మతిపోయే పోజులిచ్చింది. హెబ్బా థైషోస్ అదిరింది అంటూ అభిమానులు హీటెక్కిపోతున్నారు. వైట్ టాప్ లో థై అందాల్నిమెరిపించింది హెబ్బా . ఇక ఆమె ఓరచూపులు యువతను మరింతగా ఆకట్టుకున్నాయి. మత్తెక్కించే చూపులతో రెచ్చిపోతోంది. ఇంతగా మైకం కమ్మే చూపులతో కనిపిస్తుంటే ఏ కుర్రాడికైనా కునుకు కరువే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here