19న బంగాళాఖాతంలో అల్పపీడనం..

32
Weather update and forecast for October

మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఎక్కువుగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఏర్పడిన తరువాత 24 గంటల అనంతరం తీవ్ర అల్పపీడనంగా తయారయ్యే అవకాశముందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరుపాటి నుంచి భారీ వర్షాలు, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం ఏర్పడి కొనసాగుతుంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఉత్తర మహారాష్ట్ర– దక్షిణ గుజరాత్‌ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here