‘వైట్ టీ’తో ఆరోగ్యం పదిలం..!!

17
White Tea Benefits

వైట్ చాకొలెట్ ని  పాలు, కొన్ని పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. దీని నుండే ఈ వైట్ టీ  కాన్సెప్ట్ పుట్టింది.  ఈ రెండింటికి ఏ సంబధము లేదు. ఎంతో మంది డాక్టర్లు ఇప్పుడు దీన్ని తాగమని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులు తాగండంటూ సూచిస్తున్నారు.

దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్నారు. దీనికి వైట్ టీ  పేరు రావడానికి ఒక కారణం ఉంది. తేయాకు చిగురులపై ఉండే చిన్న తెల్లటి ముక్కల్ని ఈ టీ లో ఉపయోగిస్తారు.బ్లాక్ టీ, గ్రీన్ టీలలో ఉండే కెఫైన్ కంటే ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుందట. ఈ వైట్ టీలో ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చేశాయి. ఇది గ్రీన్ టీ కంటే ఎంతో మంచిదని కొంత మంది  నిపుణులు చెబుతున్నారు. దీని రుచి ఎంతో బాగుంటుందని అంటున్నారు.

ఈ చిగురు ఆకులతో తయారుచేసే టీలో ఎన్నో పోషకాలు ఉంటాయట. ఇవి శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టేస్తాయట. దాంతో ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.  డార్జిలింగ్ వైట్ టీ  ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.  దీని గురించి ఎవరికి తెలియదు.  ఈ టీ మహిళలకి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here