సపోటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

59
sapota

సపోటాలు తినేందుకు భలే తియ్యగా ఉంటాయి. అంతే కాదు ఇది మనకు చేకూర్చే ఆరోగ్యం కూడా స్వీట్‌గానే ఉంటుంది. సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సపోటాలో పిండిపదార్థాలు మెండుగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ ను ఇవి అందిస్తాయి. సపోటాలో ఉండే విటమిన్-A కంటికి చాలా మేలు చేస్తుంది. సపోటాలో ఆరోగ్యానికి మేలు కలిగించే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉన్నాయి.  సపోటాలో ఉండే  ఫైబర్లు మలబద్దకం సమస్యను అరికడతాయి. జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా సపోటా అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బందిపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలో కూడా సపోటాకు సాటిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సపోటాలో విటమిన్-B, C కూడా ఉంటాయి. వీటివలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉండడం వలన దీనిని తింటే ఎముకల గట్టిగా ఉంటాయి. గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా ఎంతో మేలు చేస్తుందట.

రోజూ సపోటా జ్యూస్‌ తాగేవారికి జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుందట. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయట. ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా  మేలు చేస్తుందట. నరాల ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచడంలోనూ సపోటా ఉత్తమంగా పనిచేస్తుందట. నిద్రలేమి, అందోళనతో ఇబ్బందిపడే వ్యక్తులు సపోటా తీసుకుంటే  ఉపశమనం పొందుతారట. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వాన్ని నివారించడానికి సపోటా మంచి మందులాగా పనిచేస్తుంది. అయితే, డయాబెటీస్, గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ పండును తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here