మజ్జిగ తాగితే ఎంత ఆరోగ్యమో..!

89
health-benefits-of-drinking-buttermilk

పెరుగులో బాగా నీరు పోసి సాధ్యమైనంతవరకు చిలకడం వల్ల ఏర్పడేదే మజ్జిగ.చాలామంది మజ్జిగ తాగడానికి ఇష్టపడరు. గడ్డపెరుగు అంటే ఇష్టం అంటుంటారు కొందరు. గడ్డ పెరుగు తినడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో? మనందరికీ తెలుసు.కానీ మజ్జిగ వల్ల వచ్చే లాభాలు చాలా మందికి తెలియదు. మజ్జిగలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు పల్చని మజ్జిగ తాగడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి తేలికగా జీర్ణం అయ్యే శక్తి మజ్జిగకు ఉంది. మజ్జిగ మీద పెరిగిన నీటి తేటలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉండటం వలన లివర్, స్ప్లీన్ వ్యాధులతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా నీటిని తాగడానికి ఇష్టపడని వాళ్ళు మజ్జిగను నీళ్ల లాగా చేసుకొని తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

అంతేకాకుండా గ్యాస్టిక్ తో బాధపడుతున్నవారు పల్చటి మజ్జిగ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి, అలసట, నీరసం నుంచి బయటపడవచ్చు. గుండెకు, పేగులకు మూత్రపిండాలకు ఎంతో సహకరిస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. వేసవికాలంలో రోజూ రెండు గ్లాసుల చొప్పున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయంలో పైత్యరసం పెరగకుండా ఆపుతుంది.

మజ్జిగను తాగడం వల్ల వాత, పిత్త,కఫాలను నుండి కాపాడుతుంది. వ్యాధికి కారణమయ్యే విషాలను,వ్యర్థాలను మన శరీరం నుండి పోగొట్టి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. మజ్జిగను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తాగడం వల్ల, మజ్జిగ మీద పై పొరలో బ్యాక్టీరియా పెరిగి, పైత్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి రోజుకు మించి నిల్వ చేసుకోకుండా ఉండడం ఉత్తమం. వయసు పెరిగే కొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. కాబట్టి పెరుగు కన్నా మజ్జిగ తాగడం శ్రేయస్కరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here