అంచనాలకు మించిన లాభాలతో HCL …

20
HCL

ఆర్థిక సంవత్సరం 2020-21  రెండో క్వార్టర్‌లో ఐటీ కంపెనీలు మంచి ఫలితాలను అందజేస్తున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో హెచ్‌సీఎల్  అంచనాలకు మించి లాభాలను చేకూర్చుకుంది.  త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ రూ.3,046 కోట్లుగా అంచనా వేశారు కానీ ఏకంగా రూ.3,142 కోట్లు నమోదు అయ్యింది. జూన్ త్రైమాసికం లో రూ.2,925 కోట్లు నమోదు అయ్యింది. త్రైమాసికం లో  రెవెన్యూ 4.2 శాతం పెరిగి రూ.17,841 కోట్ల నుండి రూ.18,594 కోట్లకు చేరింది.  డాలర్ యొక్క  రెవెన్యూ పెంపు 6.4 శాతం నుంచి పెరిగి 2,507 మిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఫలితాలకు విడుదల కాకముందు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ యొక్క  షేర్ ధర 843.70గా ఉంది. ఆ తర్వాత 825కు దిగింది.  అంచనాలకు మించి ఫలితాలు  ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. వరుసగా 71వ త్రైమాసికంలో డివిడెండ్ ను  ప్రకటించింది. ఒక్కో షేర్ కు రూ.4 ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here