

ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ట్రాన్స్‌జెండర్ అని తెలిసే ప్రేమించాడు. ఇంట్లో పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ చిత్రహింసలకు గురిచేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన వాడు కావటం ఆసక్తికరంగా మారింది.
ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు తారక అతని ముద్దుపేరు పండు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ భూమితో ఫేస్బుక్లో వ్యవహారం నడిపి ప్రేమించుకున్నారు. తరువాత 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ రేగింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించాడు. అదనపు కట్నం తేవాలని వేదింపులు మొదలు పెట్టాడు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ లో కేసు పెట్టడంతో పోలీసులు తారకను అరెస్టుచేసి విచారిస్తున్నారు.