హ్యాపీ బర్త్ డే టూ హీరోయిన్ ప్రణీత ..!!

21
Happy Birtyhday To Pranitha
‘ఏం పిల్లో ఏం పిల్లడో ‘ మూవీ తో ఎంట్రీ ఇచ్చి మంచి మర్క్స్ తెచ్చుకుంది ప్రణీత. ఈరోజు ప్రణీత బర్త్ డే . ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ తర్వాత ఈ అమ్మడికి చెప్పుకోదగిన సినిమా పడలేదు. ఆమె మెల్లగా సెకండ్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది.  పవర్ స్టార్ తో  నటించే ఛాన్స్ దక్కించుకుంది. ‘అత్తారింటికి దారేది’ మాత్రం ఒక రకంగా ఆమెను లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తరవాత ఎన్టీఆర్ సరనస నటించిన ‘రభస’ మహేష్ బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాపులు కావడంతో అది కాస్త మసకబారింది.

 

రామ్ మూవీ ‘హలో గురు ప్రేమ కోసమే ‘ మూవీ లో నటించింది. స్టార్ మాత్రం కాలేదు. ప్రణీత హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఆఫర్స్ కూడా పెద్దగా లేవు. కరోనా సంక్షోభంలో తనకి ఉన్నంత దానిలో సాయం చేస్తూ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. కరోనా బాధితుల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుండి హీరోయిన్స్ లో మొదటి విరాళంను ప్రకటించిన  బాపుగారి బొమ్మ చాలామందికి ఆదర్శంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here