అసలే ‘కరోనా వైరస్’ తో చస్తుంటే మధ్యలో ఈ ‘హంట వైరస్’ ఏంటి ?

0
130
Hanta Virus Hulchul in China

హంట వైరస్ :
ఎలుకలతో వ్యాపించే వైరస్ ఇది. చైనా లోని ఉనన్ అనే ఏరియా లో ఈ వైరస్ ను కనుగొన్నారు. ఇది చాలా పాత వైరస్. ఇది 1976 లోనే దక్షిణ కొరియా లో కనిపెట్టారు ఇది ప్రస్తుతం ఒకరి సోకి, ఆ వ్యక్తి చనిపోయారు. వైద్యులు ఈ వ్యక్తి ని పరీక్షించినపుడు హంట వైరస్ వల్ల చనిపోయాడని నిర్దారించారు. ఇపుడు కరోనా వల్ల ఉక్కరిబిక్కిరి అవుతున్న ప్రపంచం… ఈ హంట వైరస్ వల్ల కూడా భయపడే పరిస్థితి వస్తుందా? అని ఆందోళన పడ్తున్నారు. హంట వైరస్ ఎలుకల వల్ల వ్యాపిస్తుంది అని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ వైరస్ గాలి నుంచి కానీ, ఒక మనిషి నుంచి వేరొక మనిషి కి కానీ సోకదట. ఈ వైరస్ సోకితే మొదటగా ఊపిరితిత్తులకు సోకి శ్వాస ఇబ్బంది కల్గుతుంద. తరవాత రక్త కణాల మీద ప్రభావం చూపుతుంది. ఫ్లూ ఫీవర్, తలనొప్పి వంటివి వస్తాయ్.. ఈ హంట్ సోకినా వ్యక్తి ప్రయాణించిన బస్సు లో ఉన్న 32 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.. ఏది ఏమైనా ఎవరి జాగ్రత్తలో వారు ఉండక పోతే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందుకే అందరు తప్పనిసరిగా govt ఇచ్చిన ఆదేశాలను పాటించి దేశాన్ని కాపాడుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here