గ్రీన్ టీ vs బ్లాక్ కాఫీ ఫర్ వెయిట్ లాస్

58
green tea

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారికి  గ్రీన్ టీ మరియు బ్లాక్ కాఫీ రెండూ  మంచి పానీయాలు. ఇవి ఏంటో ఆరోగ్యకరమైనవి కూడా. కేలరీలు మరియు పోషకాలు శాతం తక్కువగా ఉంటాయి. వీటివల్ల  మీ జీవక్రియ పెరుగుతుంది మరియు కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి…

గ్రీన్ టీ దీని లో  కెఫిన్ , కాటెచిన్స్ ఫ్లేవనాయిడ్ ఉంటాయి . ఇందులోని  సమ్మేళనాలు జీవక్రియ ప్రక్రియ ను  వేగవంతం చేయడంలో సహాయపడుతాయి. ఏదయినా మితంగా వాడితే మన ఆరోగ్యం పాడవ్వడం ఖాయం ఇందులో కెఫీన్ శాతం ఎక్కువ గ ఉంటుంది దీని వల్లా నిద్రలేమి గుండె సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం.

గ్రీన్ టీ లో విటమిన్ బి, మెగ్నీషియం ,ఫ్లేవనాయిడ్లు ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గడం, గుండె పనితీరు మెరుగవ్వడం,టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడం ఇలాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. బ్లాక్ కాఫీ ద్వారా  కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ఇందులో క్రీమ్, షుగర్ పూర్తిగా ఉండవు. బరువు తగ్గాలని అనుకుంటున్నా  వ్యక్తులు దీనిని ఎక్కువగా సేవిస్తారు. అధికంగా తీసుకుంటే  ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.  కెఫిన్ శాతం  అధికంగా ఉంటుంది, శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది. బ్లాక్ కాఫీ  ఆకలిని కలిగించదు మరియు అనారోగ్యకరమైన ఆహారాన్ని సేవించడాన్ని  నిరోధిస్తుంది. జీవక్రియ రేటును 3 నుండి 11 శాతం పెంచుతుంది.

దీని లో  పోషకాలు ,యాంటీఆక్సిడెంట్లతో కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ బి 2, మాంగనీస్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉన్నాయి.  క్రమం తప్పకుండా సేవించడం వల్ల  జ్ఞాపకశక్తి పెరుగుతుంది మరియు పనితీరు మెరుగుపడుతుంది. కానీ రోజుకు 2 కప్పుల కన్నా  ఎక్కువ బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. బ్లాక్ కాఫీ కన్నా గ్రీన్ టీ బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటాయి మరియు అనేక  ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఇంకా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది.కేవలం  గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం ద్వారా మీరు బరువు తగ్గడం జరగదు. జీవన శైలి కూడా సరి అయినది గ ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here