SBI కస్టమర్ లకు గుడ్ న్యూస్ … ???

0
24
SBI

గత నెల చివరి నాటికి లోన్ మారటోరియం ముగిసింది. అయితో కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి అయినప్పటికీ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. వ్యాపారాలు లేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మారటోరియం పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి, ఎస్బీఐ తమ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పనుందని . ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు బిల్లుతో సతమతమయ్యేవారికి ఎస్బీఐ కొత్త ఆప్షన్‌తో తీపి కబురు అందించబోతుంది.

 

 

sbi

 

మారటోరియం ముగిసిన తరువాత , రుణాలు చెల్లించలేని వారికి ఆర్బీఐ రీస్ట్రక్చరింగ్ స్కీం, సొంతగా రీపేమెంట్ ప్లాన్‌ను తీసుకువచ్చి వారికీ మరింత సమయాన్ని ఇచ్చేటట్లు పరిశీలిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్ అధికారి చెబుతున్నారు. మారటోరియం మొదటి మూడు నెలల కాలంలో చాలామంది కస్టమర్లు రుణాలు చెల్లించలేదని, అలాంటి వారిని ప్రామాణిక ఖాతాలుగానే పరిగణించినట్లు చెప్పారు .మారటోరియం పొడిగించినప్పుడు రెండోసారి కొంతమంది రుణాలు చెల్లించారని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో అశ్విని కుమార్ తివారీ చెప్పారు.   సొంత రీపేమెంట్ ఆప్షన్‌ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రుణాలు  చెల్లించేందుకు వారికి ఇంకా సమయం ఇస్తున్నట్లు , వడ్డీ రేటు భారం కూడా అనుకూలంగానే  ఉంటుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here