

‘థడక్’ మూవీతో కథానాయికగా జనం ముందుకొచ్చిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గత ఏడాది ‘గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్’తో మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రకి జాన్వీ ప్రాణం పోసిందని విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు.
ఇప్పటికే ‘రూహీ అఫ్జానా’తో పాటుగా ‘దోస్తానా 2’లో నటిస్తున్న జాన్వీ కపూర్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీలో జాన్వీ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం పంజాబ్ లో మొదలైంది.
ఇందులో జాన్వీ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో దీపక్ డోబ్రియల్, మీత వశిష్ట, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి వరకు జరుగబోతోంది.