కన్నడ స్టార్ హీరోకి స్వాగతం పలికిన గని చిత్ర బృందం..!!

19
Uppendra

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్ తేజ్ తన 10వ సినిమాగా బాక్సింగ్ డ్రామాను చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా గని టైటిల్‌తో రూపొందుతుంది. ‘బాలు’ సినిమాలో  పవన్ కళ్యాణ్ పాత్ర పేరు గని అవ్వడంతో ఈ చిత్ర టైటిల్ మెగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమన్.. ‘గని’కి అద్భుతమైన నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత  అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్‌, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్ పై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా  నటిస్తుంది. కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ హీరో  సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

జూలై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు.  హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుతుండగా , కన్నడ స్టార్ ఉపేంద్ర టీంతో కలిసారు. ఆయనకు చిత్ర బృందం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికింది.  ఉపేంద్ర పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here