ఈ చందమామ ఎవ్వారం ఇప్పుడల్లా తేలేలా లేదు..

34
NASA announces it has found water on the moon

చందమామ మనకి దగ్గరగా కనిపిస్తూ ఊరిస్తూ ఊరిస్తూ ఉసూరు మనిపిస్తూ అప్పుడప్పుడూ మామ మనోడే అనుకునేట్టు ఎన్నో గొడవలు. ఈ నాసా వాళ్ళైతే ఇంత దానికి అంత దానికి అప్డేట్స్ పెడుతుంటరు. గింత దానికి కూసంత దానికి కూడా ట్వీట్లు పెడుతుంటారు.అందరికీ తెలిసేలా చేస్తుంటరు. జనాలేమో.. ఇంకేముంది చంద్రుడిపైకి బ్యాగ్ సర్దేసుకుందాం అనేసుకుని నాలుగు పచ్చళ్లు.. నాలుగు బట్టలు పెట్టుకుని .. ఒక మొబైల్ ఫోను.. చార్జర్ మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్దాం అని ఆశలు పడుతుంటారు. తీరా అంత చదివాక జస్ట్ ఓ స్కాన్ చేశాం.. ఏదో ఫోటోమాత్రం దొరికింది. ఇంకేవో ఆనవాళ్లుకూడా కొన్ని దొరికాయి అంటారు. ఇక ఇలా చేస్తే జనాలేం చేస్తరు చెప్పండి.. బ్యాగులు గీగులు పక్కన పడేసి సోషల్ మీడియాలో ఇంకేం పోస్ట్ ట్రెండింగు అవుతుంది. దేనికి ఎక్కువ లైక్ లు వస్తున్నయా అని వెతుకుతుంటారు. వాళ్లు ఆపరు.. వీళ్ల మనసూనిలవదు. ఎంతైనా చందమామ కదా. అలాగే ఉంటుంది.

ఇప్పుడు విషయం ఏంటంటే పాత విషయమే. నీటి ఆనవాళ్లు దొరికాయంట. నీటి ఆనవాళ్లు దొరికాయని దశాబ్ధ కాలం నుండి చెబుతున్నారు కదా. ఇప్పుడు కూడా అదే సోది.. అది చెప్పేది మనోళ్లు కాదు. నాసా వాళ్లు. ఎయిర్ బోర్న్ మెషినరీ తో స్కాన్ చేశారంట. ఇంకోసారి నీటి ఆనవాళ్లు కనపడ్డాయంట. సూర్యుడు పడని చోటులో ఇంకా సూర్యుడు పడే చోట కూడా నీటి ఆనవాళ్లు కనిపించాయట. అవి పరమాణు రూపంలో ఉన్నాయ్ వాటిని స్కాన్ చేశాం.. ఇంతకు ముందు నీటికి హైడ్రాక్సిన్ కి తేడాఅర్ధం కాలేదు. ఇప్పుడు తేడా తెలిసింది.. ఎయిర్ బోర్న్ కెమెరాలు.. టెక్నిక్ లు ఆక్సిజన్ లు గట్రా అంటూ ఏవేవో చెవుతున్నారు. ఫైనల్ చేసి చెప్పాలంటే. సూర్యుడు పడని చోట మంచు కనిపించేది. పడే చోట మంచుగానీ.. నీటి ఆనవాళ్లు గానీ కనిపించేవి కావట. ఇప్పుడు సూర్య రశ్మి పడే చోట కూడా నీటి ఆనవాళ్లు దొరికాయట.. ఇప్పుడు కనిపించింది కూడా నీటి జాడలే. మరి అవి ఎక్కడి నుండి వచ్చాయి. అవి మన మినరల్ వాటర్ లానే ఉంటయా ఉండవా అనేవి పరీక్షించి చూడాలి. దీనికి చాలా టైం పట్టిద్ది. అద్దీ మేటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here