సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ కారుకు యాక్సిడెంట్‌..

17
former-pakistan-skipper-shoaib-malik-has-suffered-a-car-crash-in-lahore

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ కారు ప్రమాదానికి లోనైంది. అయితే ఈ ఘటనలో ఆయనకు ప్రమాదమేమీ జరగలేదు. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ కారు నియంత్రణ తప్పి ట్రక్కును ఢీకొట్టింది. లాహోర్‌లో జాతీయ రహదారికి దగ్గరలోని ఓ రెస్టారెంటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌- 2021 టోర్నీ కోసం జరుగుతున్న సన్నాహకాల్లో పాల్గొని మాలిక్ తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరిపిన తదుపరి పోలీసులు ప్రమాదానికి కారణం మాలిక్ అతి వేగమే కారణం అని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇక యాక్సిడెంట్‌లో మాలిక్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అతను సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. “నా కారు ప్రమాదానికి లోనైంది.. ఈ ప్రమాదం నుండి సురిక్షితంగా బయటపడ్డాను.. ఆ దేవుడి దయ వల్ల నాకు ఏమి కాలేదు.. నాకోసం భగవంతుణ్ణి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. మీ ప్రేమకు ధన్యవాదాలు..” అని మాలిక్ ట్వీట్‌ చేశారు. షోయాబ్‌కు ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే భర్తకు ఫోన్ చేసి సానీయా అతని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here