విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోతే మనకన్నా చేతకాని జాతి ఉండదు..

30
former-mp-harsha-kumar-comments-on-vizagsteelplant

మాజీ ఎంపీ హర్షకుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు లక్షల కోట్లు కు పైగా విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు విక్రయించేందుకే స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కమర్షియల్ నుంచి రెసిడెన్సియల్ గా మార్పు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించేందుకు కుట్ర చేస్తున్నారు అని అన్నారు. పాలకుల తీరు వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు గురైంది అని అసహనం వ్యక్తం చేసారు. పాలకులు విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించలేదు అని మండిపడ్డారు.

బీజేపీ ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు. బీజేపీ కు ముఖ్యమంత్రి జగన్ వత్తాసు పలుకుతున్నారు అని ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసారు. ప్రదాని మోదీ కు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ను బయటపెట్టాలి అని కోరారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మే హక్కు ఎవరిచ్చారు అని నిలదీశారు. జగన్ గాలి కబుర్లు చెబుతున్నారు అని విమర్శించారు. విశాఖ ను కబలించటానికి జగన్ నియమించిన విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు అని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది అని అన్నారు.

విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమం లోకి వస్తున్నారు అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోతే మనకన్నా చేతకాని జాతి ఉండదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. పేదల భూములు బలవంతంగా లాక్కొని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త లకు అవే భూములు ఇళ్ళు స్థలాలుగా ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ద్వారా దోపిడీ కి జగన్ ప్రయత్నిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here