సిడ్నీ టెస్టులో తొలి సారి మహిళా అంపైర్..! | First female umpire in the Sydney Test

21
first-female-umpire-in-the-sydney-test

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్నమూడో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ మహిళ అంపైర్ విధులు నిర్వర్తించింది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా దేశస్తురాలైన క్లెయిర్ పోలోజాక్ ఫోర్త్ అంపైర్‌గా విధులు చేపట్టారు. 32 ఏళ్ల వయసుగల పోలోజాక్‌ పురుషుల టెస్ట్‌ మ్యాచ్ కు అఫీషియల్‌గా విధులు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు సాధించారు.

పోలోజాక్‌ 2019లో ఒమాన్, నమీబియా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌ లో ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈ మ్యాచ్ లో విధులు చేపట్టిన తొలి మహిళా ఎంపైర్ గా రికార్డు సాధించారు. క్రికెట్ మ్యాచ్ లో ఫోర్త్ అంపైర్ విధులు చాలా పరిమితంగా ఉంటాయి. ఆట మధ్యలో బంతుల్ని మార్చడం, మ్యాచ్ కోసం పిచ్‌ని రెడీ చేయడం, సబ్‌స్టిట్యూట్‌ని అనుమతించడం, ఆన్ ఫీల్డ్ అంపైర్లకి సాయం చేయడం లాంటివి ఫోర్త్ అంపైర్ యొక్క ముఖ్యమైన పనులు. ఈ క్రమంలోనే క్లెయిర్ పోలోజాక్ తన విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here