

సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది . ఐడీఏ బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొంత మందికి కార్మికులకు గాయాలు అయ్యాయి.వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి తరలించారు .పేలుళ్లతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
భారీ పేలుళ్లతో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. మరో వైపు ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో కార్మికులు ఫ్యాక్టరీ నుంచి బయటికి పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే కానీ, వాళ్ళు ఎంత మంది అనేది తెలియడం లేదు.. లోపల ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు. మంటలకు కెమికల్స్ తోడు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.