వివేక్ ఒబేరాయ్ పై కేసు..

24
fir-against-vivek-oberoi-for-not-wearing-mask-while-riding

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. వాలెంటైన్స్‌ డే రోజున వివేక్‌ భార్య ఆయనకు ఓ బైక్‌ని గిఫ్ట్ గా ఇచ్చింది. దీంతో అదే రోజు తన శ్రీమతిని బైక్‌పై ఎక్కించుకొని ముంబై విధులన్నీ చక్కర్లు కొడుతూ తిరిగాడు. ఈ వీడియోను స్వయంగా వివేక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే వివేక్‌ బైక్ నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టిలో పడింది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని కారణంగా హీరో వివేక్‌పై ముంబై పోలీసులు కేసు ఫైల్ చేసి చలానా విధించారు.

అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్‌ కూడా ధరించకపోవడంతో ఎఫైఐఆర్‌ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో అధికారులు నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిని కఠినంగా శిక్షిస్తున్నారు. వివేక్‌ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్‌ సినిమాలో కనిపించారు. అయితే ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here