మాజీ క్రికెటర్ యువరాజ్పై ఎఫ్ఐఆర్..

23
fir-against-former-cricketer-yuvraj

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ పై హర్యానా హిసార్ లోని హన్సి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 2020 వ సంవత్సరంలో జూన్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్ స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో పాల్గొని కులాల గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు యువరాజ్. తరువాత హిసార్కు చెందిన ఓ లాయర్, దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్ యువరాజ్ చేసిన ‘కులవాద వ్యాఖ్యలపై’ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో సహా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు.

అయితే కుల, మత, రంగు, లింగం విషయంలో నేనేలాంటి విభేదాలు చూపలేదని భావిస్తున్నాను. ప్రజల సంక్షేమం కోసం జీవించాను. ఇకపై కూడా అలాగే జీవిస్తాను. నేను నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు తప్పుగా మాట్లాడాను. ఒక భారతీయుడిగా ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసినట్లైతే అందుకు నన్ను క్షమించండి అని యువీ గతంలోనే క్షమాపణలు కోరాడు. టీమ్ఇండియా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ల గురించి యువీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here