రిలయన్స్ జియో-ఫేస్‌బుక్ కొత్త ట్విస్ట్…!

0
136
Facebook buys 9.99% stake in Reliance Jio for Rs 43574 crore

ఫేస్‌బుక్ – రిలయన్స్ జియో డీల్ నేపథ్యంలో బుధవారం రిలయన్స్ మార్కెట్‌ను నడిపించింది. దీనికి అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. సోషల్ మీడియా దిగ్గజం రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ప్రకటించడంతో రిలయన్స్ షేర్ బీఎస్ఈలో ఏకంగా 10.30 శాతం పెరిగి రూ. 1363వద్ద ముగిసింది. షేర్ వ్యాల్యూ పెరగడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ కూడా రూ. 80,710 కోట్లు పెరిగి రూ. 8,64,267 కోట్లకు చేరుకుంది. ముడి చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి చేరుకోవడం, సానుకూల అంతర్జాతీయ పరిణమాలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు పెరిగి 76.68 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లో టోక్యో మినహా అన్నీ లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.

జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ వ్యాల్యూ రూ.4.62 లక్షల కోట్లు (6,595 కోట్ల డాలర్లు)గా లెక్కగట్టారు. వాటా విక్రయ ప్రక్రియలో భాగంగా ఫేస్‌బుక్‌కు తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో పాటు జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డులో స్థానం కల్పిస్తారు. అంబానీ తనయుడు ఆకాశ్, కుమార్తె ఇషా అంబానీలు ఈ కంపెనీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఈ డీల్ ద్వారా లభించే నిధుల్లో రూ.15,000 కోట్లను అట్టిపెట్టుకొని, మిగతా సొమ్ముతో రిలయన్స్ రుణ భారాన్ని తగ్గించుకోనుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్‌కు అనుబంధ కంపెనీగా మారింది. జియోలో వాటాలు విక్రయించనున్నట్లు గత ఏడాది ఆగస్ట్‌లో ముఖేష్ అంబానీ తెలిపారు.
2014 తర్వాత ఫేస్‌బుక్‌కు ఇదే అతి పెద్ద డీల్. అప్పుడు వాట్సాప్‌ను టేకోవర్ చేసింది. లాక్ డౌన్ సమయంలో అథి పెద్ద కార్పోరేట్ డీల్. రిమోట్ సంప్రదింపుల ద్వారా ఒప్పందం జరిగింది. అంటే ఫేస్‌బుక్ ఇండియాలోని ఇతర రిటైల్ కంపెనీలతో జట్టుకట్టే అవకాశాలు ఉంటాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారా అంటే ఈ తరహా ఒప్పందాలకు అవకాశాలు తెరిచే ఉంటాయని ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తెలిపారు. ఫేస్‌బుక్, జియో స్వతంత్ర సంస్థలు అని, సొంత అభిప్రాయాలు ఉంటాయని తెలిపారు. ఏ విభాగాల్లో పోటీ పడాలో, ఏ విభాగాల్లో కలిసి పని చేయాలో వాటికి తెలుసునని చెప్పారు. తద్వారా పోటీ పోటీయే అని చెప్పారు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ధీటుగా జియో మార్ట్‌కు ఉపయోగపడుతుంది. రిలయన్స్ జియోకు రుణ భారం తగ్గుతుంది. వాట్సాప్ సహకారంతో కిరాణా దుకాణాలకు చేరువ కావొచ్చు. ఫేస్‌బుక్ విషయానికి వస్తే జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైనార్టీ వాటా, బోర్డులో స్థానం. చైనా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్లోకి ప్రవేశం.

38 కోట్లకు పైగా ఉన్న జియో కస్టమర్లకు చేరుకునే అవకాశం. 2022 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దేశీయంగా 85 కోట్లకు పెరగనుంది. అంతకంతకూ ఎదుగుతున్న జియో ద్వారా ఫేస్‌బుక్‌కు ప్రయోజనం. భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. అలాగే 25 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ వినియోగదారులు ఉన్నారు. జియో ఈ-కామర్స్ వ్యాపారం, వాట్సాప్, వాట్సాప్ పే సేవల అనుసంధానం ఫేస్‌బుక్‌కు కలిసి వస్తుందని చెబుతున్నారు. జియో మార్ట్స్, వాట్సాప్ కలిసి 3 కోట్ల చిన్న కిరాణా షాప్స్ నిర్వాహకులకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నేర్పే అవకాశం కల్పిస్తారు.

గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి రిలయన్స్ రుణభారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు రూ. 1,53,719 కోట్లు ఉంది. దీంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లు. 2021 నాటికి రుణరహిత సంస్థగా ఉండాలని ముఖేష్ అంబాని నిర్ణయించారు. తన క్రూడ్, కెమికల్ బిజినెస్‌లో 20% వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బ్రిటిష్ పెట్రోలియంకు రూ.7,000 కోట్లకు విక్రయించింది. ఇప్పుడు ఫేస్‌బుక్ డీల్‌తో రుణభారం తగ్గించుకునే దిశగా మరో అడుగు వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here