

సింగర్ సునీత చాలా చిన్న వయస్సులోఅంటే 19 సంవత్సరాల వయస్సులో ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పరిశ్రమలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించింది. ఎన్నో అవార్డ్స్ అందుకుంది.ఎంతో మంది హీరోయిన్ లకి గాత్ర దానం చేసింది. ఒకవైపు పాటలు పడుతూ మరోవైపు హీరోయిన్ లకి డబ్బింగ్ చెప్పుతూ చాలా బిజీగా ఉండేది.సునీత కెరీర్ బాగున్న వైవాహిక జీవితంలో సమస్యలు,మనస్పర్థల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకుని తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. రీసెంట్ గా సింగర్ సునీత డిజిటల్ మీడియా అధినేత అయినా రామ్ ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరి వివాహం జనవరి 9న అంగరంగ వైభవంగా జరిగింది.సునీత క్లోజ్ ఫ్రెండ్ ఆయన యాంకర్స్ ఝాన్సీ, సుమ వివాహ వేడుకలో చాలా సందడి చేశారు. సునీత వివాహం సందర్బంగా సునీత క్లోజ్ ఫ్రెండ్ అయిన సుమ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా సమాచారం ఖరీదైన వజ్రాల నక్లెస్ ఇచ్చినట్లు సమాచారం.సుమ, సునీత వీరిద్దరూ 25 సంవత్సరాలుగా స్నేహితులు, పైగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా.