వ్యాయామంతో మెదడుకు బలం..! | Exercises to Strengthen Your Mind

24
exercises-to-strengthen-your-mind

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే కండరాలకు బలం చేకూరుతుందని, వివిధ ఆకృతులలో శరీరాలు భాగాలు మారుతాయని అందరి అభిప్రాయం. కానీ మనం చేసే వ్యాయామంతో మెదడుకూ ఎంతో మేలుకలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.వివిధ భంగిమలలో వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరిగి మెదడుకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్, రక్తం సరఫరా అవుతాయి. మెదడులోని కణాలు పెరిగేందుకు అవసరమయ్యే హార్మోన్లు వ్యాయామం చేసే సమయంలో విడుదలవుతాయి. అంతేకాకుండా వ్యాయామం వలన మెదడుకు ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి.

వ్యాయామం చేయడం వలన ఏకగ్రాత పెరుగుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఎక్కువగా వ్యాయామం చేసేవారిలో ఏకాగ్రత సమార్థ్యాన్ని తెలిపే ఇండివిడ్యువల్‌ అల్ఫా పీక్‌ ఫ్రీక్వెన్సీ మెరుగుగా ఉందని అధ్యాయనాలు తెలిపాయి. జాగింగ్‌ వామాప్‌ల వంటి వ్యాయామాలు చేసేటప్పుడు మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం వృద్ధి చెందటమే కాకుండా గుండె, శ్వాసవేగం పెరుగుతాయి. డిప్రెషన్, మానసిక ఆందోళన వంటి లక్షణాలు తగ్గడానికి ఏరోబిగ్‌ వ్యాయామాలు సహాయపడుతాయి. అందుకే వ్యాయామం రోజు ఒక అలవాటుగా చేసుకుంటే మంచిదని వైద్యులు పదేపదే సూచిస్తారు. వారంలో 5 రోజులలో 40-60 నిమిషాల వ్యాయామం మెదడుకు ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here