అంపైర్ ను భయపెట్టిన ధోని?

28
dhoni ipl 2020

మంగళవారం జరిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో అంపైర్‌ పాల్‌ రీఫెల్‌ చేసిన పని   చర్చకు తెరలేపింది. ఈ మ్యాచ్‌లో తోలి బ్యాటింగ్‌ చేసిన చెన్నై 167 పరుగులు చేసి, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కు 168 పరుగుల లక్ష్యాన్ని వారి ఎదుట ఉంచింది. ఆ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) మినహా మిగతా వారి పేలవ బ్యాటింగ్ తో  జట్టు ఓటమి పాలయింది. అయితే ఓటమి చేరువలో ఉన్న వారికి ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ లో అంపైర్‌ రీఫెల్‌ నిర్ణయం అందరిని విస్మయానికి లోనయ్యేలా చేసింది. ఆ ఓవర్‌లో శార్దుల్‌ వేసిన రెండో బంతి వైడ్ గా వెళ్లగా దానిని వైడ్‌గా ప్రకటించేందుకు పాల్‌ రీఫెల్‌ కొంతమేర చేతులు ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తుండబోతుండగా అటు ధోని, ఇటు శార్దుల్‌ తమ అసహనాన్ని ప్రదర్శించడంతో ఎంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ బంతిని ఏ విధంగా చూసినా అది స్పష్టంగా ‘వైడ్‌’ గా కనపడుతోంది. టీవీ రీప్లేలో కూడా అది స్పష్టంగా తెలిసింది. కాగా 127 అంతర్జాతీయ మ్యాచ్‌లు అనుభవం ఉన్న మాజీ క్రికెటర్‌ రీఫెల్‌ ఆటగాళ్ల ఒత్తిడి వల్ల ఇలా చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. రైజర్స్‌ కెప్టెన్‌ వార్నర్‌ కూడా తన అసంతృప్తిని వ్యక్తపరచడం కనిపించింది. ఈ పరిణామం వల్ల సన్‌రైజర్స్‌ అభిమానులు రీఫెల్‌కు అంపైరింగ్‌ మెళుకువులు నేర్పించాలని సోషల్‌ మీడియాలో ట్రోల్స్ పెడుతున్నారు. అంపైర్‌ ధోనికి జంకి తన నిర్ణయాన్ని మార్చుకోవడమేంటని వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here