క్రీడాకారులు స్టేడియాలకు రావద్దు..!

0
139
Mithali Raj saying to players dont come to stadiums

ప్రస్తుత పరిస్థితులలో ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి స్టేడియాలు, జిమ్ లంటూ బయటికి రాకుండా ఇళ్లకే పరిమితవ్వాలంటూ తేలికపాటి వ్యాయామాలు చేసుకోవాలని భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీడాకారులకు సూచించారు. శాట్స్‌ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మంగళవారం ఆమె దాదాపుగా రెండొందల మంది పేదలకు నిత్వావసర సామాగ్రీని పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రత కారణంగా ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి సాధారణ పౌరుల మాదిరిగానే క్రీడాకారులెవరు కూడా అత్యవసరమైతే తప్పించి బయటికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే, లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి శాట్స్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ప్రభుత్వంతో పాటు వ్యాపారస్ధులు, సంపన్నలు కూడా తమ చుట్టు ప్రక్కల పేదవారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here