లేట్ నైట్ తింటున్నారా..? ఇక మీ పని అయిపోయినట్టే..!

16
does-eating-late-at-night-cause-weight-gain

బిజీ లైఫ్ స్టయిల్స్ వలన చాలా మందికి సమయానికి భోజనం చేసే అవకాశం దొరకడం లేదు. లేట్ నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ తో సతమతమవుతున్నారు. ఇవన్నీ కేవలం ఆరోగ్యంపైనే కాదు బాడీ వెయిట్ పై కూడా దుష్ప్రభావం చూపిస్తాయి. లేట్ నైట్ మీల్స్ వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్టడీస్ కూడా వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వెయిట్ గెయిన్ సమస్య తలెత్తుతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువవుతాయి. గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది. ఒబెసిటీతో పాటు ఎసిడిటీ పెరుగుతుంది. కాబట్టి, లెట్ నైట్ లో తినే హ్యాబిట్ కు చెక్ పెట్టాలి. కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బరువు తగ్గడం కష్టమవుతుంది:
లేట్ నైట్ డిన్నర్ వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గే ఎబిలిటీ తగ్గిపోతుంది. కేలరీ ఇంటేక్ తో పాటు ఫుడ్ ఛాయిసెస్ అలాగే మీల్ టైమింగ్స్ కూడా బరువుపై ప్రభావం చూపిస్తాయని గుర్తించాలి.లేట్ నైట్ లో తీసుకునే కేలరీలు ఫ్యాట్ గా మారతాయి. విపరీతంగా బరువు పెరుగుతారు.

2. మెమరీ తగ్గిపోతుంది:
లేట్ నైట్ డిన్నర్ అనేది కేవలం బరువుపైనే కాదు మెమరీపై కూడా ప్రభావం చూపుతుంది. లేట్ నైట్ ఈటింగ్ అనేది బ్రెయిన్ హెల్త్ కు కూడా ప్రమాదకరమే. కాబట్టి, ఆహారం విషయంలో సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాట్రన్స్ అనేవి సర్కేడియన్ సిస్టమ్ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. దాంతో, ఫోకస్ అలాగే కాన్సంట్రేషన్ మిస్ అవుతుంది.

3. అసిడిటీ:
లేట్ నైట్ డిన్నర్ చేసిన వెనువెంటనే నిద్రకుపక్రమిస్తే ఎసిడిటీ సమస్య మొదలవుతుంది. ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. నిద్రకు అలాగే మీల్స్ కు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.

4. ఈటింగ్ డిజార్డర్:
బెడ్ టైమ్ స్నాక్స్ కోసం మీకు క్రేవింగ్స్ ప్రతి రోజూ వస్తున్నట్టయితే సీరియస్ ప్రాబ్లెమ్ ఉందని గుర్తించాలి. ప్రతిరాత్రి ఆకలి లేకపోయినా ఎదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటే నైట్ ఈటింగ్ సిండ్రోమ్ బారిన పడ్డారేమో తెలుసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here